గోధుమ పిండిలోకి పురుగులు ఎలా వస్తాయి? రాకుండా ఏం చేయాలి?

Published by: Khagesh

గోధుమ పిండి చూస్తే శుభ్రంగానే ఉన్నట్టు కనిపిస్తుంది.

గ్రైండింగ్‌ చేసే చోటా, ప్యాకింగ్ చేసే ప్రాంతాల్లో పురుగులు గుడ్లు పెడతాయి.

ఆ పిండి తేమ ఉండే ప్రాంతానికి వచ్చేసరికి అప్పటికే ఉన్న గుడ్లు పిల్లలుగా మారుతాయి.

వెచ్చని వాతావరణానికి గుడ్లు పొదిగి పురుగులుగా మారతాయి. ఆక్సిజన్ ప్రసారమైతే పురుగుల సంతతి విస్తరిస్తుంది.

గోధుమ పిండిలో ఎక్కువగా రెడ్‌ ఫ్లోర్‌ బీటిల్స్‌, ముక్కు పురుగులు కనిపిస్తాయి.

ఎక్కువ కాలం ఒకేచోట పిండి నిల్వ చేస్తే గుడ్లు పురుగులుగా మారుతాయి.

ఇంట్లోని కందిపప్పు, బియ్యం, రవ్వలోని పురుగులు పిండిలోకి ప్రవేశించే ఛాన్స్ ఉంది.

పురుగుల చేరితే గోధుమ పిండి రంగు మారడమే కాకుండా, కంపు కొడుతుంది.

పిండి ఆడించే ముందే గోధుమలను బాగా ఎండబెట్టాలి.

గోధుమ పిండి నిల్వ చేసే డబ్బాలో బిర్యానీ ఆకులు, లవంగాలు లేదా వేప ఆకులు వేయాలి.

పిండి డబ్బాను ఫ్రింజ్‌లో పెట్టుకుంటే ఎక్కువ కాలం తాజాగా ఉంచుకోవచ్చు.