ఆరోగ్యానికి బెల్లం మంచిదా? లేదా తేనె?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

బెల్లం, తేనె రెండూ సహజమైన తీపికి ఉత్తమమైన వనరులుగా చెప్తారు.

Image Source: pexels

బెల్లం చెరకు రసంతో తయారు చేస్తే.. తేనెను తేనెటీగలు పువ్వుల రసంతో తయారు చేస్తాయి.

Image Source: pexels

అలాంటప్పుడు బెల్లం లేదా తేనె రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిదో చూద్దాం.

Image Source: pexels

పచ్చి తేనె తక్కువ ప్రాసెస్ చేస్తారు. రెండూ శక్తిని ఇస్తాయి. కానీ తేనె తక్షణ శక్తిని అందిస్తుంది.

Image Source: pexels

బెల్లంలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఎక్కువ ఉంటాయి.

Image Source: pexels

తేనెలో విటమిన్ సి, బి6, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.

Image Source: pexels

బెల్లం రక్తాన్ని శుభ్రపరచడానికి సహాయపడుతుంది. రక్తహీనతలో ఉపయోగపడుతుంది.

Image Source: pexels

తేనె రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉత్తమమైనదిగా చెప్తారు.

Image Source: pexels

భోజనం తర్వాత బెల్లం తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తేనె కడుపును శాంతపరుస్తుంది. ఎసిడిటీ తగ్గిస్తుంది.

Image Source: pexels