చలికాలంలో పొడి దగ్గును తగ్గించే ఇంటి చిట్కాలివే

Published by: Geddam Vijaya Madhuri

మందులు తీసుకున్నా పొడి దగ్గు త్వరగా తగ్గదు. ముఖ్యంగా చలికాలంలో పొడి దగ్గు మళ్లీ మళ్లీ వస్తుంది.

కేవలం మందులే కాదు.. కొన్ని ఇంటి చిట్కాలతో కూడా పొడి దగ్గును నయం చేయవచ్చు.

పొడి దగ్గుకు తేనె బాగా పనిచేస్తుంది. గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తాగండి.

వెచ్చని నీటిలో అల్లం ముక్కలు వేసి తాగవచ్చు. తేనె కూడా కలుపుకోవచ్చు.

పసుపు చలిని తగ్గించడంలో సహాయపడుతుంది. వేడి పాలలో చిటికెడు పసుపు కలిపి క్రమం తప్పకుండా తీసుకోండి. టీలో కూడా కలుపుకోవచ్చు.

జలుబు, దగ్గు తగ్గించడానికి యష్టిమధురం బాగా పనిచేస్తుంది. టీతో యష్టిమధురం కలిపి తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

గోరు వెచ్చని నీటిలో ఉప్పు కలిపి పుక్కిలించండి. ఇది గొంతులో శ్లేష్మం పేరుకుపోతే బయటకు వస్తుంది.