ముఖాన్ని మెరిసేలా చేసే ఇంటి చిట్కాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: freepik

చాలామంది ముఖానికి మెరుపు తీసుకురావడానికి చాలా ఖరీదైన వస్తువులను ఉపయోగిస్తారు.

Image Source: freepik

దీనికోసం ఖరీదైన సౌందర్య ఉత్పత్తులు ఎంచుకుంటారు. పార్లర్లను ఆశ్రయిస్తారు.

Image Source: freepik

కానీ ఇంట్లో కూడా మీ ముఖానికి బ్యూటీ పార్లర్ లాంటి మెరుపును తీసుకురావచ్చు.

Image Source: freepik

మరి ముఖాన్ని ఎలా మెరిసేలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.

Image Source: freepik

శనగపిండి ఫేస్ ప్యాక్ చర్మంలోని రంధ్రాలను బిగుతుగా చేస్తుంది. టాన్ తగ్గించడంలో సహాయపడుతుంది.

Image Source: freepik

ఒక స్పూన్ శనగపిండి, అర స్పూన్ పసుపు, పెరుగు వేసి పేస్ట్ చేయండి. ముఖానికి 10 నుంచి 15 నిమిషాలు పట్టించి.. తరువాత నీటితో కడగాలి.

Image Source: freepik

పండిన బొప్పాయిని బాగా మెత్తగా పేస్ట్ చేయండి. అందులో ఒక స్పూన్ తేనె, కొద్దిగా మీగడ కలపండి. 20 నిమిషాల పాటు ఉంచి తరువాత కడిగేయండి.

Image Source: freepik

కుంకుమ, కాఫీ ఫేస్ ప్యాక్ కూడా ముఖానికి మెరుపును ఇస్తుంది. కుంకుమపువ్వు ముఖం నుంచి టాన్ తొలగిస్తుంది. కాఫీ ముఖానికి తక్షణ మెరుపును ఇస్తుంది.

Image Source: freepik

వారానికి రెండుసార్లు వీటిని ఉపయోగిస్తే.. ముఖంపై సహజ మెరుపు చాలా కాలం పాటు ఉంటుంది.

Image Source: freepik