చలికాలంలో పెదవులు పగలకుండా ఈ చిట్కాలు ఫాలో అవ్వండి

Published by: Geddam Vijaya Madhuri
Image Source: paxels

చలివల్ల పెదవులు పొడిబారుతాయి. తేమ లేకపోవడం వల్ల పెదవులను పొడిగా, సున్నితంగా చేస్తుంది. దీనిని నివారించడానికి కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు.

Image Source: paxels

కొబ్బరి నూనెలో సహజమైన తేమ లక్షణాలు ఉన్నాయి. ఇవి పెదవులకు లోతుగా పోషణ అందిస్తాయి.

Image Source: paxels

రోజుకు 2 నుంచి 3 సార్లు పెదవులపై దీనిని అప్లై చేయండి. ఇది పెదవుల తేమను కాపాడటానికి సహాయపడుతుంది.

Image Source: paxels

నెయ్యి కూడా పెదవుల తేమను కాపాడుతుందని చెప్తారు. రాత్రుళ్లు అప్లై చేస్తే మంచిది.

Image Source: paxels

ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ చక్కెరను కలిపి ఒక సహజమైన స్క్రబ్ తయారు చేసుకోవచ్చు.

Image Source: paxels

దీనిని తేలికగా పెదవులపై అప్లై చేయండి. ఇది చనిపోయిన చర్మాన్ని తొలగించి పెదవులను మృదువుగా ఉంచుతుంది.

Image Source: paxels

ఫ్రెష్ కలబంద గుజ్జులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి పొడిబారడం, మంటను తగ్గిస్తాయి.

Image Source: paxels

కీర దోసకాయ ముక్కలు తీసుకుని పెదవులపై రుద్దండి. దానిలో సహజమైన చల్లదనం పెదవులను మృదువుగా చేస్తుంది.

Image Source: paxels

రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగండి. ఇది శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది. పెదవులు పగలకుండా కాపాడుతుంది.

Image Source: paxels