బరువు తగ్గాలా? ఈ ఆహారాన్ని డైట్లో చేర్చుకోండి ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. బరువు తగ్గేందుకు రకరకాల వ్యాయామాలు చేస్తున్నారు. వ్యాయామాలతోపాటు ఫుడ్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బరువు తగ్గడం లేదని ఆందోళన చెందుతున్నారు బరువు తగ్గాలంటే ప్రొటీన్ సప్లిమెంట్స్ అవసరం లేదు. ఈ హై ప్రొటీన్ ఫుడ్స్ డైట్లో చేర్చుకుంటే చాలు. గ్రీకు పెరుగు :గ్రీకు పెరుగులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. బ్రేక్ ఫాస్టు లో తీసుకోవచ్చు. ఇందులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. కాటేజ్ చీజ్: ఇందులో మాంసకృతులు అధికంగా ఉంటాయి. డైరెక్టుగా లేదంటే సలాడ్స్, స్మూతీస్ తో కలిపి తీసుకోవచ్చు చిక్ పీస్ లో మాంసకృతులు, ఫైబర్ అధికంగా ఉంటుంది. సలాడ్స్, సూప్స్ లేదా హమ్మస్ గా తయారు చేసుకుని తినవచ్చు. బాదంపప్పుల్లో మంచి మొత్తంలో ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి బరువు తగ్గేందుకు బెస్ట్ స్నాక్స్ గా చెప్పవచ్చు.