వడదెబ్బ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

అధిక చెమట కారణంగా శరీరంలో నీరు, ఎలక్ట్రోలైట్స్ తగ్గడం వల్ల డీహైడ్రేషన్కి గురవుతారు.

డీహైడ్రేషన్ కారణంగా అలసట, మైకం, తలనొప్పి, మూత్రం తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

వేసవి తాపంలో ఒక వ్యక్తికి అధిక చెమట, బలహీనత, వికారం, కండరాల తిమ్మెరలు వంటివి అనుభవించవచ్చు.

శరీర ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ అయినప్పుడు అత్యంత తీవ్రమైన 'సన్ స్ట్రోక్' రావచ్చు.

సన్ స్ట్రోక్ లో చర్మం వేడిగా, పొడిగా మారుతుంది. గుండె వేగంగా కొట్టుకోవడం, స్పృహ కోల్పోవడం లేదా మూర్ఛలు రావడం వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి.

అధిక వేడి కారణంగా గుండె, మూత్రపిండాలు వంటి శరీరంలోని ప్రధాన అవయవాలపై కూడా తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడవచ్చు.

వడదెబ్బకు గురైనవారు రోజంతా తగినంత నీరు తాగాలి. లిక్విడ్ ఫుడ్స్ తీసుకోవాలి. తేలికైన వదులుగా ఉండే దుస్తులు ధరించాలి.

మధ్యాహ్నం వేళలో బయటకు వెళ్లడం మానుకోండి. ఎండలో గొడుగు లేదా సన్ గ్లాసెస్ ఉపయోగించడం తప్పనిసరి.

ఎవరికైనా జలుబు లక్షణాలు కనిపిస్తే వెంటనే చల్లని ప్రదేశానికి తీసుకెళ్లి నీరు ఇచ్చి.. తక్షణ వైద్య సహాయం తీసుకోవాలి.