ఉదయాన్నే 5 గంటలకు లేవడం వల్ల మీ మనసు స్పష్టమైన ఆలోచనల కోసం కొంత సమయాన్ని ఇస్తుంది. మీరు ఏమి పనులు చేయాలనే దానిపై క్లారిటీ రావడంతో పాటు.. ఏకాగ్రతతో ఉండేందుకు హెల్ప్ అవుతుంది.
ఉదయాన్నే నిద్రలేవడం వల్ల సిర్కాయిడిన్ రిథమ్ యాక్టివ్ అవుతుంది. దీనివల్ల రాత్రుళ్లు త్వరగా నిద్ర వస్తుంది. ఈ రెండు అలవాట్లు కూడా మీ నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తాయి.
ఉదయం పూట నిద్ర లేవడం వలన కార్టిసాల్ స్థాయిలు తగ్గుతాయి. ప్రశాంతంగా ఆలోచించడానికి వీలు కలుగుతుంది. ఉదయాన్నే ధ్యానం లేదా మనస్సును నియంత్రించడం వంటివి పనులు చేస్తే ఆందోళన గణనీయంగా తగ్గుతుంది.
ప్రతిరోజు ఒకే సమయానికి నిద్ర లేవడం వలన మీ శరీర జీవ గడియారం తిరిగి ఏర్పడుతుంది. ఇది మిమ్మల్ని రోజంతా మరింత శక్తివంతంగా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. ఉదయం సూర్యరశ్మిలో కూర్చోవడం వల్ల విటమిన్ డి, సెరోటోనిన్ స్థాయిలు పెరుగుతాయి.
ఉదయాన్నే నిద్రలేవడం వల్ల నిద్ర చక్రం మెరుగవుతుంది. ఇది చర్మ పునరుద్ధరణకు మద్దతు ఇస్తుంది. ఉదయం నీరు తాగటం, ఒత్తిడిని తగ్గించుకోవడం వల్ల చర్మానికి సహజమైన మెరుపు అందుతుంది.
క్రమం తప్పకుండా ఉదయాన్నే లేస్తే మీ దినచర్య శరీర గడియారాన్ని సమతుల్యం చేస్తుంది. ఇది మెలటోనిన్, కార్టిసాల్, సెరోటోనిన్ స్థాయిలను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. హార్మోన్ల నియంత్రణ, శక్తి, మానసిక స్థితిని స్థిరీకరించడానికి ఇది చాలా అవసరం.
ఉదయాన్నే ఒంటరితనం ప్రతిబింబాన్ని, సానుభూతిని పెంపొందించడానికి హెల్ప్ చేస్తుంది. భావోద్వేగాలను నియంత్రించడానికి వీలు కల్పిస్తుంది.
పొద్దున్నే నిద్ర లేవడం వలన రెగ్యులర్గా భోజన షెడ్యూల్ ఏర్పడుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఉదయం వ్యాయామం, సూర్యరశ్మిలో ఉండడం వల్ల కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
క్రమశిక్షణను, మానసిక స్థితిస్థాపకతను పెంచుకోవడంలో హెల్ప్ చేస్తుంది. దీని దినచర్య మీ మెదడును కట్టుబడేలా చేస్తుంది.