రక్తంలో హిమోగ్లోబిన్ ఎక్కువైతే ఆరోగ్యానికి మంచిది కాదా? రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గడమే కాదు, ఎక్కువైనా ముప్పు తప్పదంటున్నారు నిపుణులు. రక్తంలో హిమోగ్లోబిన్ అధికమైతే హృదయ సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. రక్తం గడ్డకట్టడం, గుండెపోటు, పక్షవాతం ముప్పు పెరుగుతుందన్నారు. ఎముక మజ్జలోని అసాధారణ పరిస్థితులతో రక్తంలో ఎర్ర రక్తకణాలు పెరుగుతాయి. రక్తంలో ఎర్ర రక్త కణాలు పెరగడాన్ని పాలిసైథీమియా అంటారు. రక్తంలో ఎర్ర రక్తకణాలు పెరగడం వల్ల రక్తం మందంగా మారి సరఫరా మందగిస్తుంది. బ్లడ్ క్లాట్ లాంటి తీవ్ర పరిణామాలు ఏర్పడుతాయి. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరిగితే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లి చికిత్స తీసుకోవాలి. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com