పరగడుపున గోరువెచ్చని నీళ్లు తాగితే బరువు తగ్గుతారా? బరువు కంట్రోల్ చేసుకునేందుకు చాలా మంది రకరకాలా ప్రయత్నాలు చేస్తారు. పొద్దున్నే గోరు వెచ్చని నీరు తాగడం వల్ల బరువును అదుపులో పెట్టుకోవచ్చు. ఉదయం ఒక గ్లాసు గోరు వెచ్చని నీరు తాగితే చాలా మంచిది. గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం యాడ్ చేసుకుంటే ఇంకా మంచిది. గోరువెచ్చని నీరు ఆకలిని నియంత్రించి అతిగా తినడాన్ని అడ్డుకుంటుంది. భోజనానికి ముందు గోరువెచ్చని నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. ఆహారాన్ని ఎక్కువగా తినకుండా కంట్రోల్ చేసి బరువును అదుపు చేస్తుంది. గోరు వెచ్చని నీరు శరీరంలోని మలినాలను బయటకు పంపించి ఆరోగ్యంగా ఉంచుతుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com