కర్పూరంలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి.

ఇవి హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. అందుకే దీనిని ఆరోగ్యానికి మంచిది అంటున్నారు.

అంతేకాకుండా దీనిని వాసన చూడడం వల్ల కూడా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు.

జలుబు సమయంలో ముక్కు దిబ్బతో బ్లాక్ అయితే.. దీనిని వాసన చూడడం వల్ల ఉపశమనం కలుగుతుంది.

మైగ్రేన్ సమస్య ఉన్నవారికి ఈ వాసన రిలీఫ్​ని ఇస్తుంది.

ఒత్తిడి, యాంగ్జైటీ లక్షణాలతో ఇబ్బంది పడేవారు దీనిని స్మెల్ చేస్తే రిలాక్స్​ పొందుతారు.

జీర్ణ సమస్యలున్నవారికి కూడా ఇది మంచిది. గ్యాస్, ఎసిడిటీ సమస్యలు దూరమవుతాయి.

రోగనిరోధక శక్తిని పెంచడంలో కర్పూరం స్మెల్ మంచి ఫలితాలు ఇస్తుంది.

నోటి అల్సర్ సమస్యలతో ఇబ్బంది పడేవారికి కూడా దీనినుంచి ఉపశమనం ఉంటుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. మెరుగైన ఫలితాల కోసం వైద్యుడిని సంప్రదించండి. (Images Source : Envato)