సమ్మర్లో ఈ డ్రింక్ రెగ్యూలర్‌గా తాగితే ఎంత మంచిదో సమ్మర్లో పుదీనా నీటిని తాగాతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు. వేసవిలో జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఈ పుదీనా వాటర్ వాటిని దూరం చేస్తాయి. కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నవారు కూడా దీనిని రెగ్యూలర్‌గా తీసుకుంటే మంచిది. సమ్మర్లో హైడ్రేటెడ్‌గా ఉంచడంలో బాగా హెల్ప్ చేస్తుంది. ఒత్తిడిని దూరం చేసి.. రిలాక్స్‌గా ఉంచగలిగే ఆయుర్వేద గుణాలు దీనిలో ఉంటాయి. బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుందని ఓ అధ్యయనం కూడా తెలిపింది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. స్కిన్‌కి మంచి బెనిఫిట్స్ కూడా ఇస్తుంది. కప్పు నీటిలో నిమ్మకాయ, పుదీనా ఆకులు, కీరదోసతో దీనిని చేసుకోవచ్చు. ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యుల సలహా తీసుకుని తాగితే మంచిది. (Images Source : Getty)