నేలపై కూర్చొని తింటే అన్ని లాభాలా? మీరు డైలీ ఎలా భోజనం చేస్తారు? డైనింగ్ టేబుల్‌పైనా లేదా నేలపై కూర్చొనా? ఒకవేళ మీరు నేలపై కూర్చొని భోజనం చేస్తున్నట్లయితే.. మీరు చాలా లక్కీ. ఎందుకంటే.. నేలపై కూర్చొని భోజనం చెయ్యడం వల్ల బోలెడు లాభాలున్నాయట. నేలపై భోజనానికి కూర్చొనేప్పుడు.. మనకు తెలియకుండానే పద్మాసనం వేస్తాం. పద్మాసనం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. జీర్ణ సమస్యలు తొలగిపోతాయట. కింద కూర్చొని భోజనం చేసేప్పుడు పొట్టపై భారం పడుతుంది. దాని వల్ల ఎక్కువ తినడం కష్టం. నేలపై కూర్చొని ఆహారం తినడం వల్ల శరీరానికి ఎంత అవసరమో అంతే తినగలం. దానివల్ల బరువు కూడా పెరగరు. ఫలితంగా బరువు వల్ల వచ్చే అనారోగ్యాలు కూడా దరిచేరవు. ఆఫీసులకు వెళ్లేవారికి ఇది కష్టమే. కానీ, ఇంట్లో భోజనం చేసేప్పుడు మాత్రం ఇలా తినండి.