భోజనం తర్వాత అరటి పండు తింటే ఏమవుతుంది? ఆరోగ్యానికి మంచిదేనా?

చాలామందికి భోజనం తర్వాత అరటి పండు తినే అలవాటు ఉంటుంది.

మీకు కూడా ఆ అలవాటు ఉందా? ఏం పర్వాలేదు. అది మంచి అలవాటే.

అరటి పండులో ఉండే విటమిన్-సి వల్ల ఇమ్యునిటీ పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లు దరిచేరవు.

అరటి పండు వల్ల చర్మం కాంతివంతం అవుతుంది.

అరటి తినడం వల్ల విటమిన్ B6 లభిస్తుంది. ఇది పిల్లల మెదడుకు మంచిది.

నరాల బలహీనతతో బాధపడుతున్నావారికి అరటి పండు చాలా మంచిది.

అరటి పండులోని ఫైబర్ వల్ల ఆహారం బాగా జీర్ణం అవుతుంది. మలబద్దం రాదు.

అరటి పండులోని పొటాషియం వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది. గుండె పనితీరు మెరుగవుతుంది.

అరటి పండులోని ట్రిప్టోఫాన్ (tryptophan) వల్ల మైండ్‌కు రిలాక్సేషన్ లభిస్తుంది.