తలనొప్పిని పెంచే కారకాలు ఇవే.. వాటికి దూరంగా ఉండండి

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Canva

తలనొప్పికి కారణాలు

ప్రతి ఒక్కరి తలనొప్పికి కారణాలు ప్రత్యేకంగా ఉంటాయి. మీ వ్యక్తిగత కారణాలను గుర్తించండి. దీర్ఘకాలిక తలనొప్పి నియంత్రణ కోసం వాటికి దూరంగా ఉండండి.

Image Source: Canva

మద్యం

మద్యం శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. రక్త నాళాలను విస్తరిస్తుంది. ఇవి రెండూ తలనొప్పిని ప్రేరేపిస్తాయని తెలిసినవే. కొద్ది మొత్తంలో తీసుకున్నా తేలికపాటి తలనొప్పిని తీవ్రంగా చేస్తుంది. తలనొప్పి తగ్గేవరకు తాగకూడదు.

Image Source: Canva

వెలుగు

తలనొప్పి ఉన్నప్పుడు సూర్యరశ్మి, తీవ్రమైన లైటింగ్ను నివారించండి. ప్రకాశవంతమైన కాంతి.. నాడీ వ్యవస్థను అధికంగా ఉత్తేజితం చేస్తుంది. ఇది ఒత్తిడిని పెంచుతుంది. దీనివల్ల నొప్పి తీవ్రంగా, ఎక్కువసేపు ఉండేలా చేస్తుంది. మెదడును శాంతపరచడానికి లైటింగ్కి దూరంగా ఉండండి. బయటకు వెళ్తే సన్ గ్లాసెస్ ధరించండి.

Image Source: Canva

కాఫీ

కొద్ది మోతాదులో కెఫిన్ తలనొప్పిని తగ్గిస్తుంది. అధిక కెఫిన్ రక్త నాళాల హెచ్చుతగ్గులకు, ఉపసంహరణ తలనొప్పులకు కారణమవుతుంది. నొప్పి ఉన్నప్పుడు కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్ పరిమితం చేయండి.

Image Source: Canva

ఒత్తిడి

మానసిక ఒత్తిడి మెడ, తలపై కండరాలను బిగుతుగా చేస్తుంది. తలనొప్పిని మరింత తీవ్రతరం చేస్తుంది. లోతైన శ్వాస, ధ్యానం లేదా చిన్న నడక మీ నాడీ వ్యవస్థను సడలించి అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.

Image Source: Canva

డీహైడ్రేషన్

డీహైడ్రేషన్ మెదడు కణజాలాన్ని కొద్దిగా కుంచించుకుపోయేలా చేస్తాయి. నొప్పిని కలిగించే నరాలపై ఒత్తిడిని కలిగిస్తాయి. క్రమం తప్పకుండా నీరు తాగండి. వేగంగా కోలుకోవడానికి కొబ్బరి నీరు లేదా నిమ్మరసం వంటి ద్రవాలను తీసుకోండి.

Image Source: Canva

స్క్రీన్ లైట్

డిజిటల్ స్క్రీన్ల నుంచి వచ్చే నీలిరంగు కాంతి కళ్ళకు ఒత్తిడిని కలిగిస్తుంది. మెదడును అధికంగా ఉత్తేజపరుస్తుంది. నొప్పి తీవ్రతరం కాకుండా స్క్రీన్ సమయాన్ని తగ్గించండి.

Image Source: Canva

భోజనం మానేయడం

రక్తంలో చక్కెర తలనొప్పి, మైకం కలిగిస్తుంది. సమయానికి తినండి. స్థిరమైన శక్తి, నొప్పి నివారణ కోసం ప్రోటీన్, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు కలిగిన సమతుల్య భోజనం తీసుకోండి.

Image Source: Canva

బ్యాడ్ పోజ్

ఫోన్లను, కంప్యూటర్ చూసేందుకు వంచి లేదా వంగడం మెడకు తలకు కనెక్ట్ అయ్యే నరాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. నిటారుగా కూర్చోండి. తరచుగా సాగదీయండి.

Image Source: Canva

సౌండ్

సౌండ్ బ్రెయిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. నొప్పిని తీవ్రతరం చేస్తుంది. లక్షణాలు తగ్గే వరకు నిశ్శబ్ద గదిలో విశ్రాంతి తీసుకోండి. రద్దీ లేదా శబ్ద వాతావరణాలను నివారించండి.

Image Source: Canva