జుట్టు సంరక్షణ అనేది బేసిక్. ఇది మీకు మంచి రూపాన్ని ఇవ్వడమే కాకుండా.. దీర్ఘకాలిక స్కాల్ప్, జుట్టు ఆరోగ్యాన్ని కూడా నిర్ధారిస్తుంది.
షాంపూ చేయడం వల్ల జుట్టును శుభ్రపడి.. స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అయితే బలమైన, అందమైన జుట్టు కోసం సరైన విధానాన్ని ఎంచుకోవాల్సి ఉంది.
ప్రతిరోజూ తలస్నానం చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంటుందని నమ్ముతారు. అయినప్పటికీ అధికంగా షాంపూ చేయడం వల్ల సహజ నూనెలు తొలగిపోతాయి. దీనివల్ల జుట్టు పొడిగా, పెళుసుగా మారుతుంది.
తరచుగా కడగడం వల్ల వెంట్రుకలు బలహీనపడవచ్చు. స్కాల్ప్ ఇరిటేషన్ పెరుగుతుంది. సహజంగా తేమను తగ్గిస్తుంది. దీనివల్ల జుట్టు చిట్లిపోయే ప్రమాదం పెరుగుతుంది.
తలస్నానం ఎప్పుడు చేయాలనేది.. జుట్టు రకం, స్కాల్ప్ పరిస్థితి, లైఫ్‌స్టైల్ బట్టి ఉంటుంది. వివిధ రకాల జుట్టుకు ఏది బెస్టో ఇప్పుడు చూసేద్దాం.
మీ జుట్టు త్వరగా జిడ్డుగా మారే అవకాశం ఉంటే ప్రతి 2–3 రోజులకు ఓసారి షాంపూ చేయాలి. అధిక నూనెను తొలగించడంలో ఇది సహాయపడుతుంది. తలపై చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
పొడి లేదా చిక్కుతో కూడిన జుట్టు ఉన్నవారు వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే షాంపూ చేసుకోవాలి. ఎక్కువగా వాష్ చేస్తే.. సహజమైన నూనెలు తగ్గిపోతాయి.
నార్మల్ హెయిర్ ఉన్నవాళ్లు వారానికి 2–3 సార్లు షాంపూ వాడితే మంచిది. పరిశుభ్రత, తేమ బ్యాలెన్స్ అవుతుంది.
మీ తలలో చుండ్రు లేదా అధిక నూనె సమస్య ఉంటే.. తేలికపాటి హెర్బల్ షాంపూను ఉపయోగించాలి. రెగ్యులర్‌గా జాగ్రత్త తీసుకోవడం వల్ల చికాకు తగ్గుతుంది. అలాగే జుట్టు బలంగా, మెరుస్తూ ఉంటుంది.