జుట్టు మెరుస్తుందని లేదా స్టైల్ కోసం చాలామంది హెయిర్ కలర్ వేసుకుంటారు.

అయితే కొన్ని టిప్స్ ఫాలో అవ్వకపోతే జుట్టుకు రంగువేశాక హెయిర్ డ్యామేజ్ అవుతుంది.

అలా డ్యామేజ్ కాకుండా ఉండాలంటే రంగు వేసేముందు కొన్ని విషయాలపై అవగాహన ఉండాలి.

మీకు నప్పే రంగును ఎంచుకోవాలి. మీ స్కిన్ టోన్ బట్టి మీ హెయిర్ టైప్ ఉండేలా చూసుకోవాలి.

రంగు వేసుకునే ముందు కచ్చితంగా ప్యాచ్ టెస్ట్ వేసుకోవాలి.

ఇలా చేయడం వల్ల అలెర్జీలను అవాయిడ్ చేయడం సులభం అవుతుంది.

జుట్టు డర్టీగా ఉన్నప్పుడు, నూనె పెట్టుకున్నప్పుడు కలరింగ్ వేయకూడదు.

మీ జుట్టును కచ్చితంగా ఓ రోజు ముందు వాష్ చేసుకోవాలి. అంటే 24 గంటల ముందు.

సల్ఫేట్ ఫ్రీ షాంపూలు ఎంచుకుంటే మంచిది. ఇది రంగును వెలిసిపోకుండా చేస్తుంది.

అలాగే హెయిర్ వాష్ చేసుకుని వెంటనే రంగు వేసుకోకూడదు.

జుట్టు డ్రైగా మారకుండా స్నానానికి ముందు తర్వాత కూడా కండీషనర్ పెట్టాలి.