బాల్కనీలో ఉల్లిపాయలను పెంచడం ఎంత సులభమో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

ఇంటి బాల్కనీలో ఉల్లిపాయలను పెంచాలనుకుంటున్నారా? ఇది మీకోసమే.

Image Source: pexels

ఉల్లిపాయలు పెంచడానికి 6-8 అంగుళాల లోతు గల కుండీ తీసుకోండి. దిగువన నీరు పోవడానికి రంధ్రం పెట్టండి.

Image Source: pexels

ఇప్పుడు మట్టిని తయారు చేయండి. తేలికైన, సారవంతమైన, నీటిని పీల్చుకునే మట్టిని ఉపయోగించండి.

Image Source: pexels

దానిలో సేంద్రియ ఎరువులు, ఇసుక కలిపి మట్టి మిశ్రమం తయారు చేయండి.

Image Source: pexels

ఈ తయారు చేసిన మట్టిని కుండీలో నింపండి. ఆ తరువాత విత్తనాలను ఎంచుకోండి.

Image Source: pexels

ఆకుపచ్చ ఆకులు మొలిచిన సాగా ఉల్లిపాయలు తీసుకోండి.

Image Source: pexels

దీనిని నేలలో 1-2 అంగుళాల దూరంలో నాటాలి. తద్వారా అవి పెరిగేందుకు రెడీ అవుతుంది.

Image Source: pexels

తర్వాత మట్టిలో ఎరువులు, కొద్దిగా నీరు వేయాలి.

Image Source: pexels

ప్రతి రోజు లేదా రెండు రోజులకు కొద్దిగా నీరు పోయాలి. మట్టి ఎక్కువగా తడిగా ఉండకుండా చూసుకోవాలి.

Image Source: pexels

ఎండలో ఉంచితే కొన్ని వారాల్లో ఉల్లికాడలు మొలకెత్తుతాయి. కొన్ని నెలల్లో ఉల్లిపాయలు తయారవుతాయి

Image Source: pexels