తులిప్ మొక్కలను ఇంట్లోనే పెంచుకోండిలా

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pinterest

కాశ్మీర్​లోని తులిప్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి.

Image Source: pinterest

రంగురంగుల పువ్వుల అందాలను చూడటానికి చాలా మంది కాశ్మీర్ వరకు వెళతారు.

Image Source: pinterest

కానీ వీటిని చాలా సులభంగా కుండీలలో కూడా పెంచవచ్చు. ఎలాగో చూసేద్దాం.

Image Source: pinterest

దీని కోసం 12-18 అంగుళాల లోతు గల కుండీని తీసుకోండి. నీరు పోయేందుకు వీలుగా ఉంచుకోవాలి.

Image Source: pinterest

నేల తేలికగా నీరు పారుదల ఉండేలా లేకుంటే మొక్క సరిగ్గా పెరగదని గుర్తించుకోవాలి.

Image Source: pinterest

తులిప్ మొక్కను మొనదేలిన భాగాన్ని పైకి ఉంచుతూ నేలలో నాటండి.

Image Source: pinterest

ఈ మొక్కకు చల్లని గాలి అవసరం. కాబట్టి పువ్వులు వికసించే ముందు మొగ్గలను కొన్ని వారాల పాటు చల్లగా ఉంచడం అవసరం.

Image Source: pinterest

ప్రతిరోజు 4-6 గంటలు సూర్యరశ్మి తగిలేలా చూసుకోండి. నేలను తేమగా ఉంచండి.

Image Source: pinterest

సరియైన సంరక్షణతో మీ బాల్కనీలో ఈ రంగుల పూలు పెంచుకోవచ్చు.