జుట్టు నెరవడానికి ఈ విటమిన్ల లోపమే కారణం

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Pinterest/mine190557

White Hair

ఈ మధ్యకాలంలో చిన్నవారు కూడా తెల్లని జుట్టుతో ఇబ్బంది పడుతున్నారు. వయసు పెరిగే కొద్ది వచ్చే తెల్లజుట్టు యుక్తవయసులోనే వచ్చేస్తుంది.

Image Source: Pinterest/stylecraze

పోషకాల లోపం

ఇలా చిన్నతనంలోనే జుట్టు నెరవడానికి పోషకాలు, విటమిన్ల లోపమే ప్రధాన కారణమట. జుట్టు రంగు, ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సరైన పోషణ ఉండాలని అంటున్నారు.

Image Source: Pinterest/anyukam44

జుట్టు ఆరోగ్యానికై..

జుట్టు రంగును ప్రభావితం చేసే విటమిన్లను అర్థం చేసుకుంటే.. జుట్టు ముందుగానే తెల్లబడకుండా ఉంటుంది. సహజమైన జుట్టు రంగుకోసం ఇవి హెల్ప్ చేస్తాయి.

Image Source: pexels

విటమిన్ బి12

విటమిన్ బి12 లోపం వల్ల జుట్టు రంగు తేలికై చివరకు తెల్లగా మారుతుంది. ఆరోగ్యకరమైన జుట్టు కోసం ఆహారం లేదా సప్లిమెంట్ల ద్వారా తగినంత బి12 తీసుకోవడం చాలా అవసరం.

Image Source: pexels

విటమిన్ డి

విటమిన్ డి లోపం కూడా జుట్టు అకాలంగా నెరసిపోవడానికి ఒక కారణం. ఈ విటమిన్ జుట్టు కుదుళ్ల ఆరోగ్యానికి, మొత్తం జుట్టు బలానికి అవసరమవుతుంది.

Image Source: pexels

విటమిన్ డి

సూర్యరశ్మిలో ఉండడం వల్ల శరీరానికి విటమిన్ డి అందుతుంది. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు ఇది హెల్ప్ చేస్తుంది. జుట్టు నెరసిపోవడాన్ని నివారించవచ్చు.

Image Source: pexels

విటమిన్ ఇ

విటమిన్ ఇ యాంటీఆక్సిడెంట్లలో పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్లను దెబ్బతినకుండా కాపాడుతుంది. జుట్టును బలంగా, మెరిసేలా, బూడిద రంగులోకి మారకుండా హెల్ప్ చేస్తుంది.

Image Source: pexels

ఒత్తిడి

అధిక ఒత్తిడి స్థాయిలు జుట్టు నెరసిపోవడాన్ని వేగవంతం చేస్తాయి. జీవనశైలిలో మార్పులు చేయడం వల్ల ఒత్తిడిని కంట్రోల్ చేయవచ్చు. జుట్టు ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది.

Image Source: pexels

ఆహార మార్పులు

విటమిన్స్ అధికంగా ఉండే ఆహారాలు, సప్లిమెంట్లను చేర్చుకోవడం వల్ల అకాలంగా జుట్టు నెరసిపోకుండా ఉంటుంది. దీర్ఘకాలంలో బలమైన, ఆరోగ్యకరమైన జుట్టును పొందవచ్చు.

Image Source: pexels