ఆఖరి వ్యాపార దినాన MCX లో బంగారం 1,49,653 రూపాయలకు ట్రేడ్ అవుతూ ముగిసింది.
ఫిబ్రవరి 1న MCXలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి.
ముఖ్యంగా వెండి ధరలలో గణనీయమైన కోత కనిపించింది. MCX లో వెండి ఫ్యూచర్స్ దాదాపు 6% వరకు పడిపోయాయి.
ఫిబ్రవరి 1 ఉదయం 11:10 గంటలకు, MCX పై మార్చి 5 ముగింపు గల వెండి ఫ్యూచర్ ధర 2,66,130 రూపాయలకు ట్రేడ్ అవుతోంది.
ఇది మునుపటి రోజు ముగింపు ధరతో పోలిస్తే దాదాపు 25,800 రూపాయల తగ్గుదలను సూచిస్తుంది. ప్రారంభ ట్రేడింగ్లో MCX వెండి 2,84,826 రూపాయల గరిష్ట స్థాయికి చేరుకుంది.
ఢిల్లీలో బంగారం ధర (10 గ్రాములకు) 24 క్యారెట్ 1,60,730 రూపాయలు, 22 క్యారెట్ 1,47,350 రూపాయలు, 18 క్యారెట్ 1,20,590 రూపాయలు.
గుడ్ రిటర్న్ ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఫిబ్రవరి 1వ తేదీన 100 గ్రాముల వెండి కొనడానికి 35,000 రూపాయలు ఖర్చు చేయాలి.
వెండితో పాటు బంగారం ధరలు కూడా ఈ రోజు తగ్గుముఖం పట్టాయి.