పండ్లతో పచ్చళ్లు.. తింటే ఆరోగ్యానికి కలిగే లాభాలివే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

ఇండియాలో పచ్చళ్లు ఎక్కువగా చేస్తారు. ఇవి భోజన రుచిని మరింత పెంచుతాయి.

Image Source: pexels

అయితే వీటిని కొనే బదులు ఇంట్లోనే చేసుకుంటే రుచి, ఆరోగ్యం రెండూ లభిస్తాయి.

Image Source: pexels

మరి ఏయే పండ్లతో ఊరగాయలు చేసుకోవచ్చో చూసేద్దాం.

Image Source: pexels

ఏ పండ్లలోనైతే మనకు విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం, పీచు పదార్థం లభిస్తాయో.. అవి మన ఆరోగ్యానికి మంచివి.

Image Source: pexels

పచ్చి మామిడికాయ పచ్చడిని భారతీయ మసాలా దినుసులతో తయారు చేస్తారు. దీనికి ఫ్యాన్స్ ఎక్కువే.

Image Source: pexels

రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉసిరికాయ పచ్చడి కూడా చేస్తారు. 40 సంవత్సరాలు దాటిన మహిళలకు చాలా మంచిది.

Image Source: pexels

నిమ్మకాయ ఊరగాయ తినడం వల్ల మెరుగైన జీర్ణక్రియ మీ సొంతమవుతుంది.

Image Source: pexels

వాక్కాయతో కూడా పచ్చడి చేస్తారు. అయితే ఇది వర్షాకాలంలో ఎక్కువ అందుబాటులో ఉంటుంది.

Image Source: pexels

పచ్చి బొప్పాయి పచ్చడి కూడా ఆరోగ్యానికి మంచిది. ఇది ప్రోటీన్లను జీర్ణం చేయడంలో సహాయపడుతుంది.

Image Source: pexels