కళ్లు కత్తిలా పనిచేయ్యాలా? ఈ ఫుడ్ తినండి చాలు

మీకు లేదా మీ పిల్లలకు కంటి చూపు చురుగ్గా పనిచేయాలంటే వీటిని తప్పక తినండి.

కంటిశుక్లం, మాక్యులర్ క్షీణత వంటి సమస్యలు రాకూడదంటే విటమిన్-C ఎక్కువ తీసుకోవాలి.

అంటే నారింజ వంటి పుల్లని పండ్లను వారంలో కనీసం మూడుసార్లు తీసుకోండి.

క్యారెట్‌లో విటమిన్-A పుష్కలం. కాబట్టి.. దాన్ని కూడా ఆహారంలో చేర్చుకోండి.

ఇంకా స్ట్రాబెర్రీస్, మొక్క జొన్నలు, టమోటో, గుమ్మడిలోనూ విటమిన్ C, A పుష్కలం.

పిల్లలకు ఆకు కూరలు బాగా తినిపించండి. దానివల్ల కంటి చూపు సమస్యలు దరిచేరవు.

కాలే, బచ్చలి తదితర ఆకు కూరల్లో కంటిని రక్షించే విటమిన్-C, E ఉంటాయి.

అలాగే బీన్స్, చిక్కుళ్లు కూడా కంటి చూపును పెంచేవే. వాటిని అస్సలు మిస్ కావద్దు.

చిక్కుళ్లలో ఉండే బయోఫ్లావనాయిడ్స్ రెటీనాను కాపాడతాయి.

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్-E ఎక్కువగా ఉండే సన్ ఫ్లవర్ విత్తనాలు, నట్స్ కూడా తినండి.