వేడి నీటిలో మెంతులు నానబెట్టి.. క్రమం తప్పకుండా తీసుకుంటే జీవక్రియను పెంచడానికి, ఆకలిని నియంత్రించడానికి సహాయపడుతుంది.
మొలకెత్తిన మెంతి గింజలను సలాడ్లు లేదా రాప్స్లో చేర్చవచ్చు. ఇది పోషకమైన, ఫైబర్ అధికంగా కలిగి ఉంటుంది. జీర్ణక్రియకు, బరువు నిర్వహణకు సహాయపడుతుంది.
మెంతి గింజలను రాత్రిపూట నానబెట్టి.. ఉదయం పరగడుపున ఆ నీటిని తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
మెంతి పొడిని పసుపుతో కలిపి మసాలాగా వాడండి. పసుపులోని శోథ నిరోధక ప్రభావాలు, మెంతి కలిసి జీర్ణ, జీవక్రియ ప్రయోజనాలకు హెల్ప్ చేస్తాయి.
భోజనం, పెరుగు లేదా స్మూతీలలో మెంతి పొడిని కలపండి. ఇది అదనపు పీచు పదార్థాన్ని అందిస్తుంది. సంతృప్తిని పెంచుతుంది. బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది.
మెంతి గింజలు, కూరగాయలు, తేలికపాటి మసాలా దినుసులతో తయారు చేసిన తేలికపాటి సూప్.. తక్కువ కేలరీలతో కడుపు నిండేలా చేస్తుంది.
మెంతి గింజలను గ్రీన్ టీతో కలిపితే జీవక్రియకు అనుకూలమైన పానీయం తయారవుతుంది. ఇది కేలరీలను తగ్గించడంలో సహాయపడుతుంది.
మెంతి పొడిని కొద్దిగా తేనెతో కలిపి తీసుకోవాలి. ఈ మిశ్రమం జీర్ణక్రియకు సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
మెంతి పొడిని నిమ్మరసం, నీటితో కలిపి కలిపి తీసుకుంటే.. ఇది శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది. మీకు రిఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది.