ఫేక్ పనీర్‌ను ఇలా గుర్తించండి.. సింపుల్ టెక్నిక్స్

Published by: Geddam Vijaya Madhuri

స్వచ్ఛమైన పనీర్ సాధారణంగా పాల తెలుపు రంగులో ఉంటుంది. మరీ ఎక్కువగా మెరిసే తెలుపు లేదా అసహజ రంగులో ఉంటే అనుమానించాలి.

నిజమైన పనీర్ మెత్తగా, కొద్దిగా స్పాంజీగా ఉంటుంది. ఫేక్ పనీర్ మాత్రం రబ్బరు లాగా గట్టిగా లేదా ఎక్కువగా చిట్లిపోయేలా ఉండవచ్చు.

తాజా పనీర్‌కు స్వల్పంగా పాల వాసన ఉంటుంది. కెమికల్ వాసన లేదా అసహజమైన వాసన వస్తే కొనకుండా ఉండటం మంచిది.

నిజమైన పనీర్‌ను నొక్కితే మళ్లీ తన ఆకారంలోకి వస్తుంది. నొక్కగానే విరిగిపోతే లేదా చాలా గట్టిగా ఉంటే నాణ్యతపై సందేహించాలి.

చిన్న ముక్కను వేడి నీటిలో వేస్తే నిజమైన పనీర్ తన ఆకారాన్ని ఎక్కువగా మార్చదు. ఫేక్ పనీర్ మాత్రం త్వరగా విడిపోవచ్చు.

స్వచ్ఛమైన పనీర్‌కు మృదువైన పాల రుచి ఉంటుంది. చేదుగా, పుల్లగా లేదా అసహజ రుచిగా అనిపిస్తే జాగ్రత్త.

పనీర్ ముక్కపై ఒకటి రెండు చుక్కల అయోడిన్ వేస్తే నీలం రంగులోకి మారితే అందులో స్టార్చ్ కలిపి ఉండే అవకాశం ఉంది.

వండేటప్పుడు నిజమైన పనీర్ మృదువుగానే ఉంటుంది. ఫేక్ పనీర్ ఎక్కువగా గట్టిపడటం లేదా రబ్బరు లాగా మారడం కనిపించవచ్చు.

తయారీ తేదీ, గడువు తేదీ, FSSAI లైసెన్స్ నంబర్ వంటి వివరాలు ఉన్న బ్రాండ్లను మాత్రమే ఎంచుకోవాలి.

రోడ్డు పక్కన లేదా తెలియని చోట కొనడం కంటే విశ్వసనీయమైన డెయిరీలు, సూపర్ మార్కెట్లలో కొనడం సురక్షితం.