బరువు తగ్గేందుకు చాలామంది బ్రేక్‌ఫాస్ట్‌ను స్కిప్ చేసేస్తారు. కానీ బ్రేక్‌ఫాస్ట్‌లో కొన్ని ఫుడ్స్ తింటే.. ఆరోగ్యంగా ఉండడంతో పాటు బరువు తగ్గుతారు. అలాంటివాటిలో డ్రై ఫ్రూట్స్ ఒకటి. ఇది హెల్తీగా ఉంచుతూనే బరువు తగ్గడాన్ని ప్రోత్సాహిస్తాయి. ప్రోటీన్ పుష్కంలగా ఉండే బాదం ఉదయాన్నే తీసుకుంటే బరువు తగ్గుతారు. స్మూతీ, సలాడ్స్‌లో తీసుకోవచ్చు. వాల్‌నట్స్‌లో ఓమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఉంటాయి. ఇవి బరువు తగ్గడాన్ని వేగవంతం చేస్తాయి. జీడిపప్పులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది మెటబాలీజం పెంచి బరువు తగ్గేలా చేస్తుంది. ఖర్జూరాలు నోటికి రుచిగా, తియ్యగా ఉంటాయి. ఇవి బరువుతగ్గడంలో మంచి ఫలితాలు చూపిస్తాయి. పిస్తాలు ఆరోగ్యప్రయోజనాలు అందించడంతో పాటు.. బరువును కూడా తగ్గేలా చేస్తాయి. ఎండుద్రాక్షలు నేరుగా తిన్నా.. నానబెట్టి తిన్నా బరువు మాత్రం కచ్చితంగా తగ్గుతారు. అంజీర్‌ను కూడా నానబెట్టి తీసుకుంటే జీర్ణ సమస్యలు దూరమై, బరువు తగ్గుతారు. ఇవి కేవలం అవగాహన కోసమే. మెరుగైన ఫలితాల కోసం నిపుణులను సంప్రదించండి. (Images Source : Envato)