అవసరమైన దానికంటే ఎక్కువ నీరు తాగుతున్నారా? జాగ్రత్త

Published by: Geddam Vijaya Madhuri

ఎక్కువ నీరు తాగడం వల్ల రక్తంలో సోడియం స్థాయిలు తగ్గవచ్చు.

ఈ పరిస్థితిని హైపోనాట్రేమియా లేదా వాటర్ ఇంటాక్సికేషన్ అంటారు.

దాని వల్ల తలనొప్పి వికారం, వాంతులు రావచ్చు.

తీవ్రమైన పరిస్థితిలో అలసట, కండరాల బలహీనత, తిమ్మిర్లు, గందరగోళం సంభవించవచ్చు.

సోడియం చాలా తగ్గిపోతే మెదడు కణాలలో వాపు రావచ్చు.

తీవ్రమైన సందర్భాలలో మూర్ఛ రావడం కోమా లేదా ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు.

దీర్ఘకాలం పాటు తీవ్రమైన వ్యాయామం లేదా క్రీడలు చేసే వ్యక్తులలో ప్రమాదం పెరగవచ్చు.

ఎంత నీరు తాగాలి అనేది వ్యక్తి బరువు, వ్యాయామం, వాతావరణం, ఆరోగ్యం వంటి విషయాలపై ఆధారపడి ఉంటుంది.

కాబట్టి దాహం శరీర అవసరం, పరిస్థితిని బట్టి నీరు తాగడం మంచిది.