దంతాలు తెల్లగా మెరవాలా? ఈ చిట్కాలు పాటించి చూడండి

మెరిసే దంతాల నవ్వు సమ్మోహనం. అందరికీ అందంగా ఓపెన్ గా నవ్వాలనే ఉంటుంది.

కానీ దంతాలు తెల్లగా లేవేమో అనే అనుమానం ఆత్మవిశ్వాసంతో నవ్వనివ్వదు.

దంత సిరి అందాలు పెంచుకునే కొన్ని హోమ్ రెమడీస్ చూద్దాం.

కొద్దిగా టూత్ పేస్ట్ తీసుకుని అందులో కొంచెం బేకింగ్ సోడా కలిపి తర్వాత ఒక స్పూన్ నిమ్మరసం కలిపి ఈ మిశ్రమంతో పళ్లుతోముకోవాలి

కొద్దిగా అల్లం తురిమి దానిలో నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని దంతాలకు రుద్దుకుని కడిగేసుకుంటే పళ్లు తెల్లగా మెరుస్తాయి

ఒక స్పూన్ క్యారెట్ రసంలో కొద్దిగా పసుపు, టూత్ పేస్ట్ కలిపి పళ్లు తోముకుంటే దంతాలు తెల్లగా మారుతాయి.

ఒక వెల్లుల్లి రెబ్బ తురిమి అందులో ఒక స్పూన్ కాఫీ పొడి, నిమ్మకాయ కలిపి పళ్లు తోముకుంటే తెల్లని దంతాలు సొంతమవుతాయి .

అరటి పండు తొక్క మీద ఉండే తెల్లని పదార్థాన్ని కత్తితో తీసి దానికి కొంచెం వంట సోడా, నిమ్మరసం కలిపి పళ్లు తోముకుంటే దంతాలు మెరుస్తాయి.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే