మ్యాగీ ఇష్టమా? ప్రమాదంలో పడినట్లే!

ఫాస్ట్‌‌గా తయారు చేసుకోవచ్చని, టేస్టీగా ఉంటుందని చాలామంది ఇన్‌స్టెంట్ నూడుల్స్, మ్యాగీ చేసుకుంటున్నారు.

మ్యాగీ ఆరోగ్యానికి మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు. ఇందులో పోషకాలేవీ ఉండవట.

ఇందులో ఉండే మోనోసోడియం గ్లుటమేట్ అనే టేస్టీ సాల్ట్.. బరువు పెరిగేందుకు కారణమవుతుందట.

ఇందులో ఎక్కువ మోతాదులో ఉండే సోడియం రక్తనాళాలు, గుండె, కిడ్నీలను పాడు చేస్తుంది.

ఈ నూడుల్స్ హై ప్రాసెస్డ్ వైట్ ఫ్లోర్ అంటే మైదా పిండితో తయారు చేస్తారు. కనుక రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి.

వీటిని తరచుగా తినేవారిలో మెటాబొలిక్ సిండ్రొమ్, డయాబెటిస్, హై కొలెస్ట్రాల్, స్థూలకాయం సమస్యలు వస్తాయి.

వీటిలో ఉండే సంతృప్త కొవ్వులు అథెరోస్క్లీరోసిస్ వంటి పెద్ద సమస్యలకు కారణం కావచ్చు.

ఎక్కువ కాలం నిలువ ఉండేందుకు టెర్టైల్ బూటీల్హైడ్రోక్వినైన్ వంటి ప్రిజర్వేటివ్స్ వాడతారు.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.