డెంగ్యూ లక్షణాలు ఇలా కూడా ఉంటాయా? వాళ్లకే ఎక్కువ ముప్పు

డెంగ్యూ అన్ని వయస్సుల వారికీ సోకుతుంది. అయితే, చిన్న పిల్లలు, పెద్దలకు ఎక్కువ రిస్క్.

డెంగ్యూ ఐదేళ్ల లోపు పిల్లలకు సోకే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి, చాలా జాగ్రత్త అవసరం.

ఐదేళ్ల చిన్నారుల్లో రోగనిరోధక వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందదు. కాబట్టి, వారికి చాలా ప్రమాదం.

డెంగ్యూతో బాధపడుతున్న గర్బిణీలకు జన్మించే పిల్లల్లో కూడా ఈ ఇన్ఫెక్షన్ తీవ్ర ఎక్కువగా ఉంటుందట.

50 ఏళ్లు పైబడిన పెద్దలపై కూడా డెంగ్యూ ప్రభావం తీవ్రంగా ఉంటుందట.

ముఖ్యంగా డయాబెటిస్, బీపీ, గుండె సమస్యలు గలవారికి డెంగ్యూ చాలా ప్రమాదకరం.

తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి ఉన్నట్లయితే డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.

అలాగే కండరాల నొప్పి, దద్దుర్లు సైతం డెంగ్యూ లక్షణాల్లో కొన్ని.

జ్వరం వచ్చి పోతున్నా.. ఒళ్లంతా నొప్పులుగా ఉన్న డాక్టర్‌ను కలవాలి.

ఈ విషయాలను మీ బంధుమిత్రులతో పంచుకుని.. డెంగ్యూ నుంచి రక్షించండి.

Images Credit: Pixabay