మీ ముఖం, చర్మం సహజంగా మెరిసిపోవాలంటే.. రోజూ ఇవి చేయండి

Published by: Geddam Vijaya Madhuri

ఉదయం లేవగానే నీళ్లు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్లు బయటకు వెళ్తాయి. దీంతో స్కిన్ తాజాగా, కాంతివంతంగా కనిపిస్తుంది.

విటమిన్ C, విటమిన్ A, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు చర్మ కణాలను రక్షిస్తాయి. సహజమైన గ్లోను పెంచుతాయి.

ఎండలో ఎక్కువసేపు ఉండటం వల్ల చర్మం దెబ్బతినే అవకాశం ఉంది. ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు సన్‌స్క్రీన్ రాసుకోవాలి.

రోజుకు రెండు సార్లు మైల్డ్ ఫేస్‌వాష్‌తో ముఖం కడుక్కోవడం వల్ల దుమ్ము, అదనపు ఆయిల్ తొలగిపోతాయి. దీంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

రోజుకు 7 నుంచి 8 గంటల నిద్ర చర్మ ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఆ సమయంలో చర్మ కణాలు రిపేర్ అవుతాయి. సహజమైన మెరుపును ఇస్తుంది.

వ్యాయామం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో చర్మానికి ఎక్కువ ఆక్సిజన్, పోషకాలు అందుతాయి. ఇవి కాంతిని పెంచుతాయి.

అధిక ఒత్తిడి వల్ల మొటిమలు, చర్మ సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. ధ్యానం, యోగా లేదా మీకు ఇష్టమైన పనులు చేసి ఒత్తిడి తగ్గించుకోండి.

పప్పులు, గుడ్లు, పెరుగు, నట్స్ వంటి ప్రోటీన్ ఫుడ్స్ చర్మ కణాల నిర్మాణానికి అవసరం. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల చర్మం త్వరగా వృద్ధాప్య లక్షణాలను చూపించవచ్చు. చర్మం పొడిబారడం, కాంతి కోల్పోవడం వంటి సమస్యలు రావచ్చు.

మేకప్‌తోనే నిద్రపోతే రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు వచ్చే ప్రమాదం ఉంటుంది. నిద్రకు ముందు ముఖాన్ని శుభ్రం చేసుకోవడం మంచిది.

సహజమైన గ్లో ఒక్కరోజులో రాదు. సరైన ఆహారం, తగినంత నీరు, మంచి నిద్ర, క్రమమైన చర్మ సంరక్షణ అలవాట్లను పాటిస్తే చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.