చలికాలంలో పగలు తక్కువగా ఉండి.. రాత్రి ఎక్కువగా ఉండడం వల్ల సిర్కాడియన్ రిథమ్ దెబ్బతింటుంది.

పైగా చలి ఎక్కువగా ఉండడం వల్ల నిద్ర త్వరగా రాదు. రూమ్​లో ఉష్ణోగ్రత మీకు కంఫర్ట్​గా ఉండకపోవచ్చు.

గాలిలో హ్యుమిడిటీ ఎక్కువగా ఉంటుంది. పొడిబారడం, గొంతునొప్పి, గొంతు సమస్యలు కలిగి నిద్ర రాదు.

ఫటీగో, మైగ్రేన్ వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఇవి నిద్రకు దూరం చేస్తాయి.

యాక్టివ్​గా లేకుండా బద్ధకంగా ఉంటారు కాబట్టి బెడ్​ మీద ఎక్కువగా ఉంటారు. కానీ నిద్ర రాదు.

ఆస్తమా, బ్రోంకైటీస్ వంటి సమస్యల వల్ల బ్రీతింగ్ ఇబ్బందులు కలిగి నిద్రకు దూరమవుతారు.

ఒత్తిడి, యాంగ్జైటీ వల్ల కూడా నిద్ర రాదు. వీటిని దృష్టిలో పెట్టుకుని నిద్రను యోగా, మెడిటేషన్ చేయాలి.

ఏ కారణంతో నిద్ర రావట్లేదో గుర్తించి.. వాటిని పరిష్కరించుకోవాలి.

పడుకునే గదిలో హ్యూమిడిఫైర్స్​ ఉంటే పొడి గాలి ప్రభావం అంతగా ఉండదు.

ఇవన్నీ అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచి ఫలితాలుంటాయి. (Images Source : Freepik)