చెన్నై స్టైల్ సాంబార్ రెసిపీ.. ఇలా చేస్తే రుచి అదిరిపోద్ది

Published by: Geddam Vijaya Madhuri
Image Source: freepik

దక్షిణ భారతదేశమైనా సరే.. మొత్తం భారతదేశమైనా సరే.. సాంబార్ అనేది అందరికీ ఇష్టమైనది.

Image Source: freepik

ఇడ్లీతో తిన్నా.. సరే దోశతో తిన్నా.. అన్నంతో తిన్నా సరే ఇది రెండింటి రుచిని పెంచుతుంది.

Image Source: freepik

మరి ఇంట్లో రుచికరమైన సాంబార్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

Image Source: freepik

మొదట సాంబార్ చేయడానికి మసాలా తయారు చేసుకోండి.

Image Source: freepik

ఎర్ర మిరపకాయలు, శనగ పప్పు, మినపప్పు, కందిపప్పు, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసి వేయించండి. దానిలో టీస్పూన్ నూనె కూడా వేయండి.

Image Source: freepik

మంచి అరోమా వచ్చేవరకు ఉంచి.. డ్రై అయిన తర్వాత మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు అదే మూకుడులో ఒక టీస్పూన్ నూనె వేడి చేసి.. తరిగిన ఉల్లిపాయలు వేయించుకోవాలి.

Image Source: freepik

ఉల్లిపాయలు వేగిన తరువాత క్యారెట్ బీన్స్, క్యాప్సికమ్ వంటి కూరగాయలు, టమోటాలు వేసి బాగా వేయించాలి.

Image Source: freepik

వేయించిన తర్వాత పసుపు, ఉప్పు, చింతపండు రసం కలపండి. సుమారు ఒక కప్పు నీరు పోసి మరిగించాలి.

Image Source: freepik

మరిగిన తరువాత ఎర్ర మిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు వేయండి.

Image Source: freepik

ఇప్పుడు వేడి సాంబార్ను అన్నం లేదా ఇడ్లీతో వడ్డించండి.

Image Source: freepik