వానాకాలంలో సబ్జా గింజలు తీసుకోవచ్చా?

వేసవిలో సబ్జా గింజలను విరివిగా ఉపయోగిస్తారు.

ఎండతాపం నుంచి తట్టుకునేందుకు ఈ గింజలను శీతలపానీయాల్లో కలుపుకుని తాగుతారు.

వానాకాలంలో కాలంలో కూడా సబ్జా గింజలను తీసుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

వానాకాలంలో రోగ నిరోధక వ్యవస్థ బలహీనమై వ్యాధులు సోకే అవకాశం ఉంటుంది.

సబ్జా గింజలు తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ బలోపేతం అవుతుంది.

రోజూ సబ్జా గింజలు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ కరిగి బరువు తగ్గే అవకాశం ఉంది.

మలబద్ధకం, కడుపుబ్బరం లాంటి జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి.

వాటర్ లో నిమ్మరసం, తేనె, సబ్జా గింజలు కలిపి తాగితే చక్కటి ఆరోగ్యం పొందే అవకాశం ఉంటుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com