Image Source: Pexels

కొవ్వులు ఆరోగ్యానికి మంచివేనా? ఎలాంటి ఫ్యాట్స్ బెటర్?

కొవ్వు పదార్థాలు తింటే అనారోగ్యాలకు గురవ్వుతారనే భయం ఉంది. అయితే, ఇది కొంత వరకే నిజం.

కొవ్వుల్లో.. మంచి, చెడు కొవ్వులు ఉంటాయి. ఆరోగ్యంగా ఉండాలంటే చెడు కొవ్వులకు దూరంగా ఉండాలి.

సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఎన్నో అనారోగ్యాలకు కారణమవుతాయి.

అసంతృప్త కొవ్వులు మాత్రమే ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిని మోనో, పాలీ అనే రెండు రకాలుగా విభజించారు.

జంతు మాంసం, పాల ఉత్పత్తులు, ఫ్రెంచ్ ఫ్రైస్, బేక్డ్ ఫుడ్స్‌లో సంతృప్త కొవ్వులు ఉంటాయి.

ఇంకా వెజిటేబుల్ ఆయిల్, కొబ్బరి నూనె, పామ్ ఆయిల్‌లో కూడా సంతృప్త కొవ్వులు ఉంటాయి.

ఆలివ్ ఆయిల్, నట్స్, అవకాడో‌ల్లో మోనో అన్‌శాచురేటెడ్ (అసంతృప్త) కొవ్వులు ఉంటాయి.

చేపలు, సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్, నట్స్, గింజలు, గుడ్లలో మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులుంటాయి.

Image Source: Pexels

కాబట్టి, మీరు అసంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోండి.