ఖర్బూజ స్వీట్​గా ఉండాలంటే కొనేప్పుడు ఈ ట్రిక్ ఫాలో అవ్వండి

Published by: Geddam Vijaya Madhuri

మార్కెట్​లో ఖర్బూజ కొనేటప్పుడు దాని మీద ఉన్న సహజమైన చారల మధ్య రెండు వేళ్ల అంత దూరం ఉండాలి.

అలా ఉంటే ఖర్బూజ తీగపై పూర్తిగా పండినది. కోసిన తర్వాత లోపల 100% తీపిగా, జ్యూసీగా ఉంటుంది.

ఖర్బూజని మెల్లగా నొక్కినప్పుడు అది కొద్దిగా మెత్తగా ఉంటే.. అది తినడానికి సిద్ధమై పండినది అని అర్థం.

అధికంగా ముడతలు పడిన లేదా జిగట కలిగిన పుచ్చకాయ కుళ్లిపోయి ఉండవచ్చు. కాబట్టి దానిని ఎప్పుడూ కొనకూడదు.

సైజ్​లో పెద్దగా, బరువులో తేలికగా ఉండే ఖర్బూజాలు పండినవని అర్థం. బరువుగా ఉండే పుచ్చకాయలు లోపల పచ్చిగా ఉండవచ్చు.

ఖర్బూజ ఉపరితలంపై గోధుమ రంగు, ముదురు పసుపు రంగులో ఉంటే.. అది రుచికి చాలా తీయగా ఉంటుంది.

ఖర్బూజా దిగువ భాగం నుంచి వచ్చే తేలికపాటి తీపి వాసన దాని 100% తీపి, జ్యూసీగా ఉందనడానికి నిదర్శనం.

మెరిస్తూ పసుపు రంగులో ఉన్న కర్బూజా రసాయనాలతో పండించి ఉండవచ్చు. కాబట్టి సహజమైన ముదురు రంగులో ఉన్న పండును ఎంచుకోండి.

మీరు ఖర్జూజను కొనేప్పుడు ఈ టిప్స్​తో ఎంచుకుంటే స్వీట్​గా ఉండే పండును ఎంచుకోగలుగుతారు.