కొత్తగా తల్లి అయినవారిలో పిల్లలకు సరిపడేంత పాల ఉత్పత్తి ఉండకపోవచ్చు. అలాంటి వారు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీటిని తాగాలి. హైడ్రేటెడ్‌గా ఉంటే పాల ఉత్పత్తి మెరుగవుతుంది. పోషకాలతో నిండిన ఫుడ్ తినాలి. పండ్లు, కూరగాయలు, పప్పులు, హెల్తీ ఫ్యాట్స్ తీసుకోవాలి. ఓట్స్, బార్లీ, బ్రౌన్ రైస్, ఆకుకూరలు, నట్స్ వంటివి తీసుకుంటే పాల ఉత్పత్తి పెరుగుతుంది. బేబికి కనీసం రోజులో 8 నుంచి 12 సార్లు పాలు ఇవ్వాలి. దీనివల్ల కూడా పాల ఉత్పత్తి పెరుగుతుంది. పాలిచ్చేప్పుడు సరైన పద్ధతిలో, కంఫర్టబుల్‌గా ఉంటే పాలు బేబికి అందుతాయి. బేబిని చూస్తూ.. వారితో స్కిన్ టూ స్కిన్ ఇంట్రాక్షన్లో ఉండాలి. దీనివల్ల ఆక్సీటోసిన్ పెరిగి.. పాల ఉత్పత్తి పెరుగుతుంది. రోజుకు కనీసం 6 నుంచి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోండి. దీనివల్ల హార్మోన్స్ కంట్రోల్లో ఉంటాయి. ఫీడింగ్‌కి మంచిది. ఒత్తిడిని తగ్గించుకునేందుకు మెడిటేషన్, డీప్ బ్రీతింగ్, యోగా చేస్తే మంచిది. ప్రెగ్నెన్సీ సమయం నుంచే వీటిని ఫాలో అయితే మంచి ఫలితాలుంటాయి.