ఉడికించిన గుడ్లలో ప్రోటీన్, విటమిన్స్, మినిరల్స్ ఉంటాయి. ఇవి ఎదిగే పిల్లలకు మంచిది.

కానీ పిల్లలకు గుడ్డు పెట్టేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

పిల్లలకు గుడ్డు తినిపించాలనుకుంటే కనీసం 6 నెలలు దాటిన తర్వాత నిపుణుల సలహాతో ఇవ్వొచ్చు.

ముందుగా పిల్లలకు బాగా ఉడికించిన గుడ్డు సొనను తినిపించాలి. తర్వాత ఎగ్​ వైట్​ని ఇవ్వాలి.

గుడ్డు పెట్టిన తర్వాత పిల్లలకు ర్యాష్, వాంతులు, బ్రీతింగ్ తీసుకోవడంలో ఇబ్బందులు వస్తున్నాయేమో చెక్ చేసుకోవాలి.

గుడ్డును ఎప్పుడూ పూర్తిగా ఉడికించి ఇవ్వాలి. హాఫ్ బాయిల్డ్ వంటివి పిల్లలకు ఇవ్వకపోతే మంచిది.

1 నుంచి 3 ఏళ్ల పిల్లలకు గుడ్డులో సగం లేదా మొత్తం గుడ్డు పెడితే సరిపోతుంది.

ఒకటి కంటే ఎక్కువ గుడ్డును ఎప్పుడూ తినిపించకపోవడమే మంచిది. వైద్యుల సూచనలు తీసుకోవాలి.

స్పైసీ ఫుడ్స్, ఉప్పు ఎక్కువగా ఉండే వాటితో కాకుండా కూరగాయలతో కలిపి ఇస్తే మంచిది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.