బిర్యానీ చాలా స్పేసీగా, నూనెతో నిండి ఉంటుంది. కాబట్టి దానిని తిన్నాక కొన్ని ఫుడ్స్ తీసుకుంటే పలు సమస్యలు వస్తాయి.

అందుకే బిర్యానీ తిన్నాక కొన్ని ఫుడ్స్ అస్సలు తీసుకోవద్దని చెప్తున్నారు నిపుణులు. అవేంటో.. ఎందుకో ఇప్పుడు చూద్దాం.

బిర్యానీ తర్వాత సోడా, సాఫ్ట్ డ్రింక్స్ తాగకూడదట. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు పెరుగుతాయి.

స్వీట్స్ జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఖీర్, రస్మలై, ఐస్​క్రీమ్ వంటివి జీర్ణ సమస్యలను పెంచుతాయి.

నారింజలు, నిమ్మకాయలు, పుచ్చకాయ వంటి వాటిని తినకూడదు. దీనివల్ల కూడా కడుపు నొప్పి రావొచ్చు.

పెరుగు ఆరోగ్యానికి మంచిదే. అయితే బిర్యానీ తర్వాత తింటే కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.

మిల్క్​షేక్స్, పాలు వంటివి బిర్యానీ తర్వాత తీసుకోవద్దట. దీనివల్ల ఎసిడిటీ వస్తుందట.

పచ్చళ్లు, డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్, చట్నీలు తింటే ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలను పెంచుతుంది.

బిర్యానీ తర్వాత చాలామంది టీ తాగుతారు. టీ, కాఫీలు తాగడం వల్ల ఎసిడిటీ పెరుగుతుంది.

ఆల్కహాల్ జీర్ణ సమస్యలను పెంచుతుంది. లివర్ హెల్త్​ని కరాబ్ చేస్తుంది. బిర్యానీ తర్వాత తినకపోవడమే మంచిది.

బిర్యానీ తర్వాత సోంపు తినొచ్చు. గోరువెచ్చని నీటిని లేదా బటర్ మిల్క్ తాగితే మంచిది.