దాల్చిన చెక్కను మహిళలు డైట్​లో తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయని చెప్తున్నారు.

హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడమే కాకుండా పీరియడ్స్ రెగ్యులర్​గా రావడంలో హెల్ప్ చేస్తుంది.

ముఖ్యంగా PCOS సమస్యతో ఇబ్బంది పడేవారికి మంచిది. దీనిలోని యాంటీఇన్​ఫ్లమేటరీ లక్షణాలు పీరియడ్స్ నొప్పిని తగ్గిస్తాయి.

శరీరంలో షుగర్ లెవెల్స్​ని కంట్రోల్ చేసి.. క్రేవింగ్స్ తగ్గిస్తాయి. మెటబాలీజం పెంచి బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది.

దాల్చిన చెక్క ఇన్సూలిన్ సెన్సిటివిటీని పెంచి.. ఫెర్టిలిటీ సమస్యలను దూరం చేస్తుంది.

దీనిలోని యాంటీఆక్సిడెంట్లు యాక్నేని తగ్గించి వృద్ధాప్యఛాయలను దూరం చేస్తాయి. గ్లోయింగ్ స్కిన్​ని ప్రమోట్ చేస్తాయి.

డయాబెటిస్, పీసీఓఎస్ సమస్యలతో ఇబ్బంది పడేవారు రెగ్యులర్​గా తీసుకుంటే మంచిది.

యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్ లక్షణాలు యూటీఐ సమస్యలను దూరం చేసి ఇన్​ఫెక్షన్లు రాకుండా చేస్తాయి.

ఒత్తిడిని తగ్గించి మూడ్​ని మెరుగుపరుస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచి.. పనిపై ఫోకస్ చేసేలా చేస్తాయి.

అయితే ఎక్కువ మోతాదులో దీనిని తీసుకోకపోవడమే మంచిది. ప్రెగ్నెన్సీతో ఉండేవారు వైద్యుల సలహా తీసుకోవాలి.

రోజుకు 1 టీస్పూన్ పౌడర్ లేదా అర చెక్క తీసుకుంటే మంచిది.