వర్షాకాలంలో ఉల్లిపాయ పచ్చిగా తినొచ్చట. అయితే దానివల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఉల్లిపాయల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాయి.

దీనిలోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు వర్షాకాలంలో వైరస్లు సోకకుండా హెల్ప్ చేస్తాయి.

ఉల్లిపాయలోని ప్రోబయోటిక్స్ గట్ హెల్త్, జీర్ణ సమస్యలను దూరం చేస్తాయి.

శరీరంలోని వేడిని తగ్గించి శరీరాన్ని చల్లగా చేయడంలో హెల్ప్ చేస్తుంది.

ఉల్లిపాయలు తీసుకునే ముందు వాటిని బాగా కడిగాలి. కుళ్లిపోయిన వాటిని తినకూడదు.

మిగిలిపోయిన ఉల్లిపాయలు తినకూడదు. వాటిపై బ్యాక్టీరియా వ్యాపించే ప్రమాదముంది.

స్ట్రీట్ ఫుడ్ కాకుండా హెల్తీ, ఫ్రెష్ ఫుడ్స్​తో కలిపి తీసుకోవాలి. ఎక్కువగా తినకపోవడమే మంచిది.

గ్యాస్, ఎసిడిటీ సమస్యలు ఉన్నవారు ఉల్లిపాయను పచ్చిగా తినకపోవడమే మంచిది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాతో తీసుకుంటే మంచిది.