పీరియడ్స్ సమయంలో బ్లాక్ కాఫీ తాగొద్దట, ఎందుకంటే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Canva

చేదు నిజం

బ్లాక్ కాఫీ శక్తిని, ఏకాగ్రతను పెంచుతుందని తెలిసినప్పటికీ.. పీరయిడ్స్ సమయంలో ఉత్తమ ఎంపిక కాకపోవచ్చు.

Image Source: freepik

ఆరోగ్య పానీయం

బ్లాక్ కాఫీ బరువు తగ్గడానికి, కాలేయ పనితీరును మెరుగుపరచడానికి, జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది.

Image Source: freepik

పీరియడ్స్ సమయంలో వద్దు

పీరియడ్స్ సమయంలో శరీరం మరింత సున్నితంగా మారుతుంది. కెఫిన్ తీసుకోవడం సహజ హార్మోన్ల సమతుల్యతకు ఆటంకం కలిగిస్తుంది.

Image Source: freepik

డీహైడ్రేషన్

కెఫిన్ మూత్రవిసర్జనగా పనిచేస్తుంది. ఇది శరీరంలో నీటిని తగ్గిస్తుంది. ఋతుస్రావం సమయంలో తలనొప్పిని మరింత తీవ్రతరం చేస్తుంది.

Image Source: freepik

పీరియడ్స్ నొప్పి

కెఫిన్ రక్త నాళాలను కుంచించుకుపోయేలా చేస్తుంది. నెలసరి తిమ్మెర్లు, పొత్తికడుపు నొప్పిని పెంచుతుంది.

Image Source: freepik

హార్మోన్ల అసమతుల్యత

ఋతు సమయంలో అధిక కాఫీ తీసుకోవడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని మానసిక స్థితిలో మార్పులు వస్తాయి.

Image Source: freepik

చికాకు

కెఫిన్ నాడీ వ్యవస్థను అధికంగా ఉత్తేజితం చేస్తుంది. దీని వలన రుతుక్రమం సమయంలో చిరాకు, ఆందోళన, ఒత్తిడి పెరుగుతుంది.

Image Source: freepik

అలసట

పీరియడ్స్ సమయంలో ఒంట్లో ఓపిక నిజంగానే తగ్గుతుంది. కాఫీ తాత్కాలికంగా ఇచ్చే ఉత్తేజం తరచుగా కెఫిన్ తర్వాత అలసటకు దారి తీస్తుంది.

Image Source: freepik

నిద్ర సమస్యలు

నిద్రపోయే ముందు బ్లాక్ కాఫీ తాగితే నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. దీనివల్ల మీరు అలసిపోయి నిద్రలేమికి గురవుతారు.

Image Source: pexels

ప్రతికూల ప్రభావం

ఋతు సమయంలో నల్ల కాఫీ తాగడం వల్ల అసౌకర్యం కలుగుతుంది. తిమ్మిర్లు లేదా అలసట వంటి లక్షణాలు మరింత తీవ్రమవుతాయి.

Image Source: freepik