మూత్రపిండాలు శరీరంలో వడపోత యంత్రాలుగా పనిచేస్తాయి. మూత్రం ద్వారా వ్యర్థాలు, విషపదార్థాలు, అధిక నీటిని తొలగించడానికి సహాయం చేస్తాయి.
మూత్రపిండాలు ప్రతిరోజూ దాదాపు 200 లీటర్ల రక్తాన్ని వడపోస్తాయి. యూరియా, ఇతర మలినాలను బయటకు పంపి మీ శరీర వ్యవస్థను శుభ్రంగా, శక్తివంతంగా ఉంచుతాయి.
కొన్ని అలవాట్ల వల్ల మూత్రపిండాలు బలహీనపడతాయట. ఉదయాన్నే ఈ మిస్టేక్స్ చేస్తే కిడ్నీలు డ్యామేజ్ అవుతాయట.
శరీరం రాత్రి సమయంలో నిర్జలీకరణకు గురవుతుంది. ఉదయం నీరు తాగకపోవడం వల్ల హైడ్రేషన్ లేకుండానే కిడ్నీలు పనిచేయడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది. దీనివల్ల వాటిపై అదనపు ఒత్తిడి పడుతుంది.
మూత్రం ఆపుకోవడం వల్ల మూత్ర మార్గంలో బాక్టీరియా పెరిగి మూత్రపిండాలకు హాని కలిగించే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
కెఫిన్ మూత్రవిసర్జనగా పనిచేస్తుంది. నిర్జలీకరణాన్ని పెంచుతుంది. ద్రవ సమతుల్యతను నిర్వహించడానికి మూత్రపిండాలను అవసరమైన దానికంటే ఎక్కువగా కష్టపడేలా చేస్తుంది.
ఉదయం అల్పాహారం తీసుకోకపోవడం వల్ల రక్తంలో చక్కెర, రక్తపోటు హెచ్చుతగ్గుల ఉంటుంది. ఇది కాలక్రమేణా కిడ్నీల ఆరోగ్యంపై పరోక్షంగా ప్రభావం చూపుతుంది.
ఉదయాన్నే ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. మూత్రపిండాలు ఎక్కువ పని చేస్తాయి. ఇది దీర్ఘకాలిక నష్టానికి దారి తీస్తుంది.