నల్లని యాలకులు తెలుసా? ఇంట్లో పెంచుకోండిలా

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pixabay

పెద్ద ఏలకులను నల్లని యాలకులు అంటారు. ఇవి ఎండబెట్టి వాటి పండ్లు, గింజలను వంటల్లో ఉపయోగిస్తారు.

Image Source: pixabay

వీటిని ఇంట్లో పెంచుకోవాలనుకుంటే.. మంచి క్వాలిటీ గల పెద్ద యాలకులను ఎంచుకుని.. 24 గంటల పాటు గోరువెచ్చని నీటిలో నానబెట్టుకోవాలి.

Image Source: pixabay

పది నుంచి పన్నెండు అంగుళాల లోతు ఉండే, నీరు పోయేందుకు మంచి వ్యవస్థ ఉన్న కుండీని ఎంచుకోండి. ఎందుకంటే ఈ మొక్క వేర్లు ఎక్కువ లోతు పెరగవు.

Image Source: pixabay

50% సారవంతమైన మట్టి 30% ఎరువు లేదా పశువుల ఎరువు, 20% కొబ్బరి పీచు లేదా ఇసుక కలిపి తయారు చేసుకోండి.

Image Source: pixabay

విత్తనాలను నేలలో 1–2 సెంటీమీటర్ల లోతులో నాటండి. వాటిని మట్టితో కప్పండి.

Image Source: pixabay

విత్తనాలు నాటిన తరువాత నేలలో తేమ ఉండేలా మట్టిపై కొద్దిగా నీరు చల్లండి.

Image Source: pixabay

కుండీని ఉదయం లేత సూర్యరశ్మి తగిలేలా ఉంచండి. ఎందుకంటే ఈ మొక్క నీడను ఇష్టపడుతుంది.

Image Source: pixabay

విత్తనాలు మొలకెత్తడానికి 30 నుంచి 40 రోజులు పట్టవచ్చు. ప్రతి 20–25 రోజులకు సేంద్రియ ఎరువులు, వానపాముల కంపోస్ట్ వేయడం వల్ల బాగా పెరుగుతుంది.

Image Source: pixabay

మొక్కకు తేమ నిరంతరం ఉండేలా చూసుకోండి. మొక్క 2–3 సంవత్సరాలలో యాలకులు ఇవ్వడం ప్రారంభిస్తుంది.

Image Source: pixabay