తేనెను పెదాలకు ఇలా అప్లై చేస్తే మంచిది

Published by: Geddam Vijaya Madhuri

తేనెను నేరుగా పెదవులపై అప్లై చేసి 10–15 నిమిషాలు ఉంచి కడిగేయండి. మంచిగా మాయిశ్చరైజ్ అవుతాయి.

తేనెకు కొంచెం చక్కెర కలిపి స్క్రబ్‌లా ఉపయోగిస్తే డెడ్ స్కిన్ తొలగుతుంది.

తేనె + నిమ్మరసం కలిపి అప్లై చేస్తే పెదవుల డార్క్‌నెస్ తగ్గుతుంది.

తేనె, కొబ్బరి నూనె మిశ్రమం పెదవులను దీర్ఘకాలం మాయిశ్చరైజ్ చేస్తుంది.

పడుకునే ముందు తేనె అప్లై చేసి రాత్రంతా ఉంచితే ఉదయం సాఫ్ట్ లిప్స్ మీ సొంతమవుతాయి.

కలబందతో కలిపి అప్లై చేస్తే.. పెదవుల చర్మాన్ని హీలింగ్ చేసి క్రాక్స్ తగ్గిస్తుంది.

తేనె, వెన్నతో కలిపి అప్లై చేస్తే.. పెదవులు పొడిబారడం తగ్గుతాయి.

రోజ్ వాటర్తో కలిపి అప్లై చేస్తే.. పెదవులకు నేచురల్ పింక్ టింట్ అందుతుంది.

బీట్ రూట్ జ్యూస్తో కలిపి అప్లై చేస్తే పెదవులు సహజంగా పింక్‌గా మారేందుకు హెల్ప్ చేస్తుంది.

తేనె, బీస్‌వ్యాక్స్, కొబ్బరి నూనె కలిపి ఇంట్లోనే లిప్ బామ్ తయారు చేసుకోవచ్చు.

రోజూ ఎక్కువగా స్క్రబ్ చేయకండి. వారానికి రెండు సార్లు సరిపోతుంది.