చియా సీడ్స్ పోషకాలతో నిండి ఉంటాయి. ఇవి శక్తిని పెంచి, జీర్ణక్రియకు సహాయపడటం వరకు ఎన్నో లాభాలు అందిస్తాయి. కాబట్టి వాటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడానికి మంచిదని చెప్తున్నారు.
ఈ సీడ్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి, వాపును తగ్గించడానికి, మెదడు పనితీరును మెరుగుపరచడానికి అవసరమవుతాయి.
ఇవి మొత్తం ఆరోగ్యానికే కాదు బరువు తగ్గడానికి కూడా సహజ నివారణగా పని చేస్తుంది. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీవక్రియను పెంచుతాయి.
బరువు తగ్గడానికి చియా గింజలను సరైన పద్ధతిలో తీసుకోవడం ముఖ్యం. వాటిని మీ ఆహారంలో ఎలా చేర్చుకోవచ్చో ఇక్కడ ఉంది.
చియా గింజలను స్మూతీస్, సలాడ్లు, డీటాక్స్ డ్రింక్స్‌లలో తీసుకోవచ్చు. నీటిలో నానబెట్టవచ్చు. కానీ బరువు తగ్గడానికి వాటిని నానబెట్టడం చాలా ముఖ్యం.
ఒక టీస్పూన్ చియా గింజలను ఒక గ్లాసు నీటిలో రాత్రిపూట నానబెట్టండి. ఇది గింజలు ఉబ్బడానికి వీలు కల్పిస్తుంది. ఇది జీర్ణం చేసుకోవడానికి సులభతరం చేస్తుంది. బరువు నిర్వహణలో మేలు చేస్తుంది.
ఉదయం చియా సీడ్స్‌ని నీటిలో కలిపి నిమ్మరసంతో తీసుకోండి. నిమ్మకాయ కొవ్వును తగ్గించడంలో, శరీరాన్ని డీటాక్స్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. మెటబాలీజం పెంచుతుంది.
ప్రతిరోజూ పరగడుపున చియా సీడ్, నిమ్మరసం తీసుకోవడం వల్ల క్రేవింగ్స్ తగ్గుతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. స్థిరంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
చియా గింజలను నిమ్మరసంతో కలిపినప్పుడు.. అవి బరువు నిర్వహణకు మరింత బాగా పనిచేస్తాయి. హైడ్రేషన్, యాంటీఆక్సిడెంట్లు, కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి.