బీపీ తక్కువగా ఉండేవారు తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Canva

లో బీపీకి కారణాలు

నేటి వేగవంతమైన జీవితంలో అనారోగ్యకరమైన జీవనశైలి అలవాట్లు, పేలవమైన ఆహార ఎంపికలు లో బీపీ కేసులకు కారణమవుతున్నాయి.

Image Source: pexels

రక్తపోటు ఎంత ఉండాలి?

ఆరోగ్యకరమైన రక్తపోటు సాధారణంగా 120/80 mmHg ఉంటుంది. ఇది గుండె, శరీరం సరిగ్గా పనిచేసేలా చేస్తుంది.

Image Source: pexels

BP ఎప్పుడు 'తక్కువ' అవుతుంది?

రక్తపోటు 90/60 mmHg కంటే తగ్గితే.. వైద్యపరంగా తక్కువ రక్తపోటు లేదా హైపోటెన్షన్గా పరిగణిస్తారు.

Image Source: pexels

లో బీపీ లక్షణాలు

తక్కువ రక్తపోటు వలన మైకం, అలసట, దృష్టిలోపం, తేలికపాటి తలనొప్పి, తీవ్రమైన సందర్భాల్లో మూర్ఛ కూడా వస్తాయి.

Image Source: pexels

ఆహారం చాలా ముఖ్యం

లో బీపీ ఉన్నప్పుడు రక్తపోటు స్థాయిల్లో ఆహారం చాలా కీలకం అవుతుంది.

Image Source: pexels

ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి?

బీపీని రెగ్యులేట్ చేసేందుకు మంచి ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిదో చూసేద్దాం.

Image Source: pexels

ఉప్పుతో కూడిన ఆహారాలు

రక్తపోటు తగ్గినప్పుడు.. దానిని త్వరగా పెంచడానికి చిప్స్, నంకీన్, ఉప్పుతో వేయించిన నట్స్ తీసుకోవచ్చు.

Image Source: pexels

ప్రోటీన్

పనీర్, డార్క్ చాక్లెట్, కొబ్బరి నీరు, తాజా పండ్లు తినడం వల్ల రక్తపోటు రెగ్యులేట్ అవుతుంది.

Image Source: pexels

ఉప్పు, నిమ్మరసం

ఉప్పులో నిమ్మరసం కలిపి ఆ నీరు తాగటం వలన రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. రక్తపోటు పెరుగుతుంది.

Image Source: pexels

కాఫీ

బ్లాక్ కాఫీ కప్పు తాగితే మంచిది. కెఫిన్ రక్తపోటును తాత్కాలికంగా పెంచుతుంది. ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

Image Source: pexels