రాత్రుళ్లు వెల్లుల్లి తినడం వల్ల నిద్ర నాణ్యత పెరుగుతుంది. నిద్ర సమస్యలు దూరం చేసుకోవడానికి తినొచ్చు.

రోగనిరోధక శక్తిని పెంచడంలో హెల్ప్ చేస్తుంది. విశ్రాంతినిచ్చి త్వరగా రికవరీ అయ్యేలా చేస్తుంది.

కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.

రక్తపోటు, మధుమేహ సమస్యలను రెగ్యులేట్ చేయడంలో మంచి ఫలితాలు ఇస్తుంది.

వెల్లుల్లిలోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు లివర్ ఫంక్షన్కి హెల్ప్ చేస్తాయి.

వెల్లుల్లితో లాభాలున్నా.. రాత్రుళ్లు వాటిని తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

పచ్చి వెల్లుల్లి తింటే హీట్ బర్న్, గ్యాస్, నోటి వాసన వంటివి వస్తాయి. ముఖ్యంగా ఖాళీ కడుపుతో ఉంటే మరీ ఇబ్బందిగా ఉంటుంది.

యాసిడ్ రిఫ్లక్స్ ఉంటే కనుక వెల్లుల్లిని తినకపోవడమే మంచిది.

ఒకవేళ వెల్లుల్లి తినాలకుంటే ఒక్క రెబ్బ మాత్రమే తీసుకుంటే మంచిది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.