తలకు ఆవాల నూనె రాస్తే కలిగే లాభాలివే

జుట్టుకు ఆవాల నూనెతో మసాజ్ చేస్తే రక్త ప్రసరణ పెరుగుతుంది. జుట్టు కుదుళ్లు బలపడతాయి. రాలడం తగ్గుతుంది.

చుండ్రు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇది జుట్టు వేగంగా పెరగడానికి, కొత్త జుట్టు పెరగడానికి సహాయపడుతుంది.

క్రమం తప్పకుండా తలకు ఆవాల నూనె రాసుకుంటే జుట్టు రాలడం వంటి సమస్యలు తగ్గుతాయి.

ఎక్కువసేపు ఉంచుకోలేకపోతే తల స్నానం చేయడానికి ఒక గంట ముందు ఆవాల నూనెను తలకు పట్టించండి.

తలకు గోరువెచ్చని ఆవనూనె రాసుకుంటే తలలో రక్త ప్రసరణ పెరుగుతుంది.

తలకి ఆవాల నూనెతో మసాజ్ చేస్తే తలనొప్పి మైగ్రేన్, టెన్షన్ సమస్యల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.

క్రమం తప్పకుండా తలకు ఆవాల నూనె రాసుకుంటే రాత్రి బాగా, గాఢంగా నిద్ర పడుతుంది.

ఆవాల నూనె జుట్టుకు సహజమైన మెరుపును తెస్తుంది. అలాగే జుట్టును మృదువుగా చేస్తుంది.

ఆవాల నూనె బ్యాక్టీరియా, శిలీంధ్రాలను పెరగనివ్వదు. దీనివల్ల తలపై చర్మం శుభ్రంగా, ఇన్ఫెక్షన్ లేకుండా ఉంటుంది.

సకాలం కాని సమయంలో వెంట్రుకలు తెల్లబడటం వంటి సమస్యను ఆవాల నూనె తగ్గిస్తుంది.