బీట్​రూట్ జ్యూస్ ఎవరు తాగకూడదో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Canva

ఆరోగ్య ప్రయోజనాలు

బీట్​రూట్ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది మొత్తం ఆరోగ్యం, శక్తిని మెరుగుపరుస్తుంది.

Image Source: pexels

బ్లడ్ పెరుగుదలకై

బీట్​రూట్ జ్యూస్ చేసే ముఖ్యమైన ప్రయోజనాల్లో ఒకటి ఏమిటంటే.. ఇది శరీరంలో రక్తం పెరగడానికి సహాయపడుతుంది. తద్వారా మెరుగైన రక్త ప్రసరణను అందిస్తుంది.

Image Source: pexels

వారు తాగకూడదు

అయితే బీట్ రూట్ జ్యూస్ కొందరు తాగవద్దని చెప్తున్నారు నిపుణులు. అది ఆరోగ్యానకిి మంచిదైనా తాగకూడదని చెప్తున్నారు.

Image Source: Canva

కిడ్నీ సమస్యలు

బీట్​రూట్లలో ఆక్సలేట్లు ఉంటాయి. ఇవి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి దోహదం చేస్తాయి. మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు సమస్యలు రాకుండా ఉండటానికి దీనిని తీసుకోకూడదు.

Image Source: Canva

మధుమేహం

బీట్​రూట్​ జ్యూస్​లో సహజమైన చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తుల రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. కాబట్టి ఇది వారికి సురక్షితం కాదు.

Image Source: pexels

జీర్ణ సమస్యలు

జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడేవారు బీట్​రూట్ జ్యూస్ తీసుకోకూడదు. ఎందుకంటే దానిలోని పీచు పదార్థం కడుపు ఉబ్బరం, ఇతర జీర్ణ సమస్యలకు కారణం అవుతుంది.

Image Source: Canva

స్కిన్ అలెర్జీ

చర్మ సంబంధిత అలర్జీలు ఉన్నవారు బీట్​రూట్​ జ్యూస్ తాగడం మానుకోవాలి. ఇది అలర్జీ, ప్రతిచర్యలను ఎక్కువ చేస్తుంది.

Image Source: Canva

రక్తపోటు

బీట్​రూట్​ జ్యూస్ రక్తపోటును తగ్గిస్తుంది. కాబట్టి ఇప్పటికే తక్కువ రక్తపోటు ఉన్న వారు మైకం లేదా వాంతులు వచ్చే అవకాశం ఉంది.

Image Source: Canva

బౌల్ సిండ్రోమ్

బీట్​రూట్​ జ్యూస్ ఐబీఎస్ లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది. కడుపు తిమ్మిరితో సహా, దీనితో బాధపడేవారు తాగకపోవడమే మంచిది.

Image Source: Canva